Jeevans || jeevankumar ||

Wednesday, 25 October 2017

ఆడవే మయూరి

చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన
కర కంకణములు గలగలలాడగా
వినీల గజభర విలాస బంధుర
తనూలతిక చంచలించిపోగా

ఆడవే మయూరి నటనమాడవే మయూరి
నీ కులుకును గని నా పలుకు విరియ
నీ నటనను గని నవ కవిత వెలియగా
ఆడవే మయూరి నటనమాడవే మయూరి

అది యమునా సుందర తీరము
అది రమణీయ బృందావనము
అది విరిసిన పున్నమి వెన్నెల
అది వీచిన తెమ్మెర ఊయల
అది చల్లని సైకత వేదిక
ఆట సాగెను విరహిని రాధిక
అది రాధ మనసులో మాధవుడూదిన
రసమయ మురళి గీతిక

ఆడవే మయూరి నటనమాడవే మయూరి
నా పలుకులకెనెయగు కులుకు చూపి
నా కవితకు సరియగు నటన చూపి
ఇక ఆడవే మయూరి నటనమాడవే మయూరి

పాలా  నేత్ర   సంప్రభావిత జ్వాలలు  ప్రసవ సరుని దహియించగా
పతి ని  కోలిపడి రతి దేవి   దుక్కిత్త మతి ఐ  రోదించగా
హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవ ప్రమధ గణము కనిపించగా
ప్రమదనాద కర పంకజ భ్రాంకృత ఢమరుద్వని వినిపించగా
ప్రళయ కాల  సంకలిత భయంకర జలదరార్బటుల
జలిత దిక్కటుల జహిత దిక్కరుల వికృత ఘీంకృతుల
సహస్రఫణ సంచలిత భూత్క్రుతుల

కనులలోన కనుబొమలలోన అధరమ్ములోన వదనమ్ములోన
గళసీమలోన కటిసీమలోన కరయుగములోన పదయుగములోన
నీ తనువులోని అణువణువులోన
అనంత విధముల అభినయించి
ఇక ఆడవే...ఆడవే..ఆడవే.........

No comments:

Post a Comment